ఎన్డీఏ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: పవన్‌ కల్యాణ్‌

ఎన్డీఏ మేనిఫెస్టోను ఎల్లుండి ప్రకటించనున్నట్టు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం అని అన్నారు.

By అంజి  Published on  28 April 2024 3:45 PM GMT
Janasena, Pawan Kalyan, Eleswaram, APPolls

ఎన్డీఏ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: పవన్‌ కల్యాణ్‌

ఎన్డీఏ మేనిఫెస్టోను ఎల్లుండి ప్రకటించనున్నట్టు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం అని అన్నారు. ప్రధాని మోదీ దగ్గర ఏదైనా మాట్లాడాలంటే జగన్‌కు భయమని, ఆయన మోదీ దగ్గరకు వెళ్లి కేసులు కొట్టేయాలని కోరుతారని అన్నారు. తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదని, మోదీతో తాను ధైర్యంగా మాట్లాడగలనని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కష్టాల్లో ఉన్న రైతుల కన్నీరు తుడవడమే తనకు ఆనందం అని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని ఏళేశ్వరం సభలో పవన్‌ వ్యాఖ్యానించారు. మాఫియా డాన్‌లతో పోరాడుతున్నామన్న పవన్‌.. మన దశ దిశ మార్చుకునే ఎన్నికలు ఇవి అని అన్నారు.

పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి జిల్లాలోకి బయటివారిని రానివ్వరు, కానీ వారు మాత్రం పక్క జిల్లాలకు వచ్చి దోచుకుంటారని పవన్‌ ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక పంతాడ అక్రమ మైనింగ్‌ను క్రమబద్ధీకరిస్తామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రాగానే ఎయిడెడ్‌ విద్యాసంస్థలను పునరుద్ధరిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవని పవన్‌ అన్నారు. జగన్‌ సారా అమ్ముతూ రూ.40వేల కోట్లు సంపాదించారని ఆరోపణలు చేశారు. మద్యం నిషేధిస్తామని.. ప్రభుత్వమే మద్యం అమ్ముతోందని ఎద్దేవా చేశారు. ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే కూటమి లక్ష్యమని పవన్‌ పేర్కొన్నారు. ఓడిపోయినా దశాబ్దం పాటు రాజకీయాల్లో ఉన్నానంటే యువత భవిష్యత్‌ కోసమేనని చెప్పారు.

Next Story