Pushpa : అల్లు అర్జున్ అభిమానుల‌కు క్రేజీ అప్‌డేట్‌

ర‌ష్మిక మందన్న పుట్టిన రోజు సంద‌ర్భంగా 20 సెక‌న్ల నిడివి గ‌ల గ్లింప్స్‌ను విడుదల చేసింది పుష్ప-2 చిత్ర‌బృందం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2023 8:10 AM GMT
Allu Arjun, Pushpa The Rule

పుష్పరాజ్‌ ఎక్కడ..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'పుష్ప 2'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న పోస్ట‌ర్ కూడా విడుద‌ల కాలేదు.

అయితే.. నేడు ర‌ష్మిక మందన్న పుట్టిన రోజు సంద‌ర్భంగా 20 సెక‌న్ల నిడివి గ‌ల గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర‌బృందం." పుష్పరాజ్‌ ఎక్కడ..? సెర్చ్ ఆప‌రేష‌న్‌ త్వరలోనే ముగుస్తుంది. ఏప్రిల్‌ 7న సాయంత్రం 4:05 గంటలకు పూర్తి వీడియోను విడుద‌ల చేయ‌నున్నాం." అని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ వీడియో చూసిన అల్లు అర్జున్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

మలయాళ స్టార్ యాక్టర్‌ ఫహద్‌ ఫాసిల్‌, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story