ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే..!

రెబల్ స్టార్ ప్రభాస్‌ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’.

By Srikanth Gundamalla  Published on  27 April 2024 12:40 PM GMT
prabhas, movie, kalki 2898-ad,  release date ,

 ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే..!

రెబల్ స్టార్ ప్రభాస్‌ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా నటిస్తుండగా.. ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ సహా ఇతర నటీనటులు నటిస్తున్నారు. ప్రభాస్‌ ఈ కల్కి మూవీలో భైరవ పాత్రలో కనిపించనున్నారని చిత్ర యూనిట్‌ ఇప్పటికే తెలిపింది. పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ కనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది.

కాగా.. ఈ కల్కి మూవీ మే 9వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. ఆ సమయంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కారణంగా విడుదల తేదీని మార్చాలని నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. మే 9వ తేదీన విడుదల కావాల్సిన కల్కి సినిమాను.. జూన్‌ 27న విడుదల చేయనున్నట్లు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ఈ మేరకు ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. మే నెల తర్వాత మరెన్ని నెలల వరకు సినిమాను వాయిదా వేస్తారో అని కంగారుపడ్డ అభిమానులకు ఇది శుభవార్తగా మారింది. ఇక తాజాగా విడుదలైన పోస్టర్‌లో అమితాబ్‌, ప్రభాస్, దీపికా పదుకోన్ యోధుల గెటప్‌లో కనిపిస్తున్నారు.


Next Story