జీహెచ్‌ఎంసీ: నేరేడ్‌మెట్‌లో టీఆర్‌ఎస్‌ విజయం

GHMC Neredmet TRS candidate Win .. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేరేడ్‌మెట్‌ ఫలితం వెల్లడైంది. టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది.

By సుభాష్  Published on  9 Dec 2020 5:53 AM GMT
జీహెచ్‌ఎంసీ:  నేరేడ్‌మెట్‌లో టీఆర్‌ఎస్‌ విజయం

జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేరేడ్‌మెట్‌ ఫలితం వెల్లడైంది. టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. 668 ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మీనా ఉపేందర్‌రెడ్డి గెలుపొందారు. ఈనెల 4న నేరేడ్‌మెట్‌ డివిజన్‌ ఓట్ల లెక్కింపు చేపట్టారు. అయితే టీఆర్‌ఎస్‌ 504 ఓట్ల మెజార్టీతో ఉన్నప్పటికీ ఇతర ముద్రతో ఉన్న ఓట్లు 544 ఉన్నాయి. ఇతర ముద్రతో ఉన్న ఓట్ల మెజార్టీ కంటే ఎక్కువ ఉండటంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఆ డివిజన్‌ ఫలితాన్ని ప్రకటించలేదు. తాజాగా ఇతర ముద్రలున్న ఓట్లు పరిగణలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతించడంతో నేరేడ్‌మెట్‌ డివిజన్‌ ఓట్ల లెక్కింపును బుధవారం ఉదయం చేపట్టారు. ఇతరు గుర్తులున్న 544 ఓట్లతో టీఆర్‌ఎస్‌కు 278 ఓట్లు వచ్చాయి.

కౌంటింగ్‌ కేంద్రం వద్ద బీజేపీ ఆందోళన

అయితే నేరేడ్‌మెట్‌ కౌంటింగ్‌ వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తిరస్కరణకు గురైన 1300 ఓట్లు లెక్కించాలని బీజేపీ అభ్యర్థి ప్రసన్ననాయుడు డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. పోలింగ్‌ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీకి ఎన్నికల అధికారులు అనుకూలంగా వ్యవహరించి 600లకుపైగా చెల్లని ఓట్లను టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేశారని ప్రసన్ననాయుడు ఇంతకు ముందు ఆరోపించిన విషయం తెలిసిందే.

Next Story