ఇంటర్వ్యూ: ఉద్యోగాల కల్పన, పెద్దపల్లి బొగ్గు గనులపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ స్పందన ఇదే

అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు దక్కాల్సిందేనని పోరాడుతూ ఉన్న యువ నాయకుల్లో 32 ఏళ్ల గడ్డం వంశీ కృష్ణ ఒకరు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 May 2024 8:00 AM GMT
interview, congress mp candidate, gaddam vamsi krishna,

ఇంటర్వ్యూ: ఉద్యోగాల కల్పన, పెద్దపల్లి బొగ్గు గనులపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ స్పందన ఇదే

సుస్థిర పరిష్కారాలు, సామాన్యులకు మంచి చేయడం, ఎనర్జీకి సంబంధించి ప్రజలను చైతన్య పరచడం, అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు దక్కాల్సిందేనని పోరాడుతూ ఉన్న యువ నాయకుల్లో 32 ఏళ్ల గడ్డం వంశీ కృష్ణ ఒకరు. పెద్దపల్లి నుండి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి అయినా.. పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం

గడ్డం కుటుంబానికి పెద్దపల్లి రాజకీయపరంగా కంచుకోట. వంశీకృష్ణ తాత మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి, అతని తండ్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేకానంద్ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఇప్పుడు యువకుడైన గడ్డం వంశీకృష్ణ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

న్యూస్‌మీటర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ కృష్ణ ఉద్యోగాల అవసరం, ప్రాథమిక జీవన పోరాటం, ప్రజల ఆకాంక్షల గురించి మాట్లాడాడు.

న్యూస్ మీటర్: మీరు ఎంపీగా ఎన్నికైతే ఈ ప్రాంతానికి మీరు చేసే పనులు, అమలు చేయబోయే ప్రణాళికలు ఏమిటి?

వంశీ కృష్ణ: పునరుత్పాదక ఇంధనం గురించి చాలా చర్చలు ఉన్నాయి. అయితే థర్మల్ శక్తి కూడా ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఉపయోగిస్తూ ఉన్నారని అర్థం చేసుకోవాలి. మనం రెండింటి మధ్య సమతుల్యతను సృష్టించాలి. పునరుత్పాదక శక్తి కూడా ముఖ్యమే.. దానికి సంబంధించి చాలా విషయాల్లో మనకు అవగాహన ఉండాలి. ఉదాహరణకు, రూఫ్‌టాప్ సోలార్ యూనిట్‌లు సులభంగా ఇన్‌స్టాల్ చేయొచ్చు. స్థిరమైన శక్తిని అందించడం వల్ల వాటి ప్రభావం ఎలా ఉంటుందో పట్టణ ప్రాంతాల్లో మనం చూడవచ్చు.

పెద్దపల్లిలోని ఎన్‌టీపీసీ ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి సోలార్‌ ప్లాంట్‌ ఉన్నప్పటికీ రాబోయే 25 ఏళ్లుగా భారీ మొత్తంలో భూమి అవసరమవుతుంది. ఆ కారణంగా, సంపూర్ణ, అనుకూలమైన పరిష్కారాలతో విద్యుత్ విప్లవాన్ని తీసుకుని రావాలి. థర్మల్ ఎనర్జీ ఉత్పత్తి కూడా కీలకంగా మారనుంది. సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన ఈ రంగంలో ఉద్యోగాలను రక్షించాల్సిన అవసరం కూడా ఉంది. దేశంలోని ఇంధన ఉత్పత్తి కేంద్రాల మధ్య సమతుల్యత అవసరం. మనం ఆ దిశగా కృషి చేయాలి.

న్యూస్ మీటర్: మీ తాత, తండ్రి.. ఇప్పుడు మీరు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన కుటుంబం నుండి వచ్చారు. రీజియన్‌లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను, ముఖ్యంగా పెద్దపల్లిలో ఓపెన్ కాస్ట్ గనుల సమస్యను ఎలా పరిష్కరించాలని మీరు ఆలోచిస్తున్నారు?

వంశీ కృష్ణ: నేను స్థిరమైన పరిష్కారాలను తీసుకునే నేపథ్యం నుండి వచ్చాను. బొగ్గు అవసరమయ్యే సవాళ్లు ఉన్నందున భారతదేశంలో విద్యుత్ రంగం ఇప్పటికీ అభివృద్ధి చెందుతోంది. పెద్దపల్లిలో మనకున్న బొగ్గుగనులు దేశం మొత్తానికి శక్తినిచ్చేందుకు సరిపోతుంది. పెద్దపల్లి నుండి విజయవాడ వరకు విస్తరించి ఉన్న నిల్వలు అపారమైనవి. మరికొన్ని సంవత్సరాల పాటు భారతదేశానికి ఉపయోగపడగలవు.

అయితే ఈ ప్రాంతంలోని బొగ్గును మనం ఎంత సమర్ధవంతంగా వినియోగిస్తున్నామన్నదే చాలా ముఖ్యం. మన దగ్గర తగినంత నాణ్యమైన బొగ్గు ఉంది, అయినప్పటికీ మేము దానిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాం. థర్మల్ ప్లాంట్లను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి మనం స్థిరమైన, మంచి పద్ధతులను అభివృద్ధి చేయాలి. బొగ్గు గనులను ప్రైవేటీకరించకుండా చూడాలి. ఈ ప్రాంతం ఉద్యోగాల కోసం బొగ్గు గనులపై ఆధారపడి ఉంటుంది. తగినంత విద్యుదుత్పత్తి లేదా ఉద్యోగాలు లేనందున ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ రెండింటి మధ్య సమతూకం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

న్యూస్ మీటర్: కాంగ్రెస్ హామీలలో ఒకటి ఉద్యోగాలు.. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారా?

వంశీకృష్ణ: మన దగ్గర డైనమిక్ యువత ఉంది. కానీ గత 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేవు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా సెక్టార్‌లను గుర్తించి అందుకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టంగా చెప్పారు. ఆ కారణంగా, అప్రెంటిస్‌షిప్ హక్కు అనేది యువతకు నైపుణ్యం ఉన్న రంగాలపై ఆధారపడి ఉంటుంది. పెద్దపల్లిలో ఈ ప్రాంతంలోని ఇంధన రంగాలపై మా దృష్టి ఉంది. 10 ఏళ్లు బకాయి ఉండడంతో ఇప్పుడు పరిష్కరించడం పెద్ద సవాల్‌గా మారింది.

న్యూస్ మీటర్: పెద్దపల్లి కూడా తాగునీరు, స్థిరమైన మౌలిక సదుపాయాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంది. దీనిపై మీ స్పందన?

వంశీకృష్ణ: ఒకవైపు ఈ ప్రాంతం విద్యుత్‌ ఉత్పత్తి రంగం మీద ఆధారపడి ఉండి ఉంటే.. మరోవైపు కనీస సమస్యలు పరిష్కారం కాలేదు. గ్రామాల్లో సరైన రోడ్లు లేవు, స్వచ్ఛ భారత్ పథకం, మరుగుదొడ్ల నిర్మాణం ఇక్కడ కనిపించడం లేదు. పెద్దపల్లిలో మహిళలకు మరుగుదొడ్లు లేవు. ఈ ప్రాంతానికి ఏమీ చేయకపోవడం బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు సిగ్గుపడాలి.

న్యూస్ మీటర్: BJP, BRS ప్రజల ఆకాంక్షలను మెరుగుపరిచామని అంటున్నారు. కాంగ్రెస్ హామీలు గుప్పిస్తున్నప్పటికీ, వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ సామర్థ్యాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఏమని చెబుతారు.

వంశీకృష్ణ: బీజేపీ, బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు కేరాఫ్ గా నిలిచాయి. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ మీద అబద్ధాలు చెబుతూ ఉన్నాయి. బాధ్యతాయుతమైన ప్రభుత్వాలుగా వ్యవహరించకుండా.. సోషల్ మీడియాను ఉపయోగించి ఇతరులపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాయి. కాంగ్రెస్ మరింత బాధ్యతగా వ్యవహరిస్తోంది. ఇటీవల జరిగిన ర్యాలీలో, అంబానీ- అదానీల పిల్లలు తమ జీవనోపాధి కోసం ప్రతిరోజూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో స్వైప్ చేస్తున్నారా అని రాహుల్ గాంధీ ప్రజలను అడిగారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుంది.

న్యూస్ మీటర్: తెలంగాణలో, గత BRS ప్రభుత్వ విధానాలు ఆర్థికంగా స్థిరంగా లేనందున చాలా సమస్యలు ఉన్నాయని అంటున్నారు. అది కాంగ్రెస్ హామీలకు ఆటంకం కలిగిస్తూ ఉందా? కేంద్ర స్థాయిలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో మీరంతా దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు?

వంశీకృష్ణ: ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అయితే కాంగ్రెస్ ఇప్పటి వరకు ఐదు హామీలను అమలు చేసింది. రాష్ట్రంలోని బలాబలాలపై పార్టీ నాయకత్వం కసరత్తు చేయడం, వారిని గుర్తించడం, సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం వల్ల ఇది సాధ్యమైంది. మా బలాలను ఆప్టిమైజ్ చేయడం, ఆదాయ ప్రవాహాలను పెంచడంపై దృష్టి కేంద్రీకరించబడింది. బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్లుగా పాలించి ఉద్యోగాలు, ఇళ్లు, నీళ్లకు సంబంధించిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. కేసీఆర్ తన బస్సుయాత్రలో వచ్చి ఉద్యోగాలు ఎక్కడివి, నీళ్లు ఎక్కడివని అడిగారు. 10 ఏళ్లు అధికారంలో ఉండీ ఏమీ చేయకుండా.. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. ప్రస్తుత రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా మా వంతు కృషి చేస్తున్నాం. మేము వ్యవస్థను సరైన మార్గంలోకి తీసుకుని వస్తున్నాము. రాష్ట్రం తప్పక అభివృద్ధి చెందుతుంది.. రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేలా తప్పకుండా చూస్తాము.

న్యూస్ మీటర్: మీరు రాజకీయాల్లోకి వచ్చింది ఇప్పుడే. మీరు తక్కువ సమయంలోనే ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కేంద్రంలో మీకు మంచి స్థానం దక్కుతుందా?

వంశీకృష్ణ: నేను చాలా నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చాను. ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యం. 10 మందికి.. మరో 100 మందికి మంచి చేసి అలా దాన్ని కొనసాగించడమే నా లక్ష్యం.

పూర్తి ఇంటర్వ్యూని యూట్యూబ్‌లో చూడండి:


Next Story